ముద్రగడ మృతిపై శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల సంతాపం

రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల సామాజిక, రాజకీయ రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాయుడు నిమ్మకాయలతో పాటు శతఘ్ని న్యూస్ ప్రతినిధులు ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయన కుమార్తె శ్రీమతి బార్లపూడి క్రాంతి, అల్లుడు చందును పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల, డైరెక్టర్ రాజేష్ నంద్యాల, జిల్లా స్టాఫర్ ధనరాజ్ నంద్యాల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.