
నరసాపురం నియోజకవర్గం: నరసాపురం మండలం, చిట్టవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పోలిశెట్టి జోగింధర మురళీధర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదేశాల మేరకు ట్రస్ట్ కన్వీనర్ సునీత నాయకర్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా జోగింధర మురళీధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సునీత నాయకర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి, ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా బొమ్మిడి నాయకర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పైడికొండల కృష్ణ, కర్రా శ్రీను, గ్రంధి శ్రీనివాస్, రేవు ప్రభుదాస్, కొప్పాడ కృష్ణవేణి, బందెల భారతి, ఒడుగు వల్లి, ట్రస్ట్ కార్యదర్శి పెమ్మాడి కిరణ్, ఎం. సూర్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.