జనవాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించారు.

వారి నుంచి అర్జీలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC) చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వీకరించారు.

అర్జీలను పరిశీలించిన ఆయన, సంబంధిత జిల్లాల అధికార ప్రతినిధులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్, గుంటూరు జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.