వడ్డిగూడెం గ్రామ సభలో సాగునీటి భద్రతపై చర్చ

రంపచోడవరం: వి.ఆర్.పురం మండలం, వడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయములో ప్రత్యేక అధికారి, మండల అభివృద్ధి అధికారి ఇమ్మానుయేల్ అధ్యక్షతన ” సాగునీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” (జలధార) గ్రామ సభ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇమ్మానియేల్, జనసేన టిడిపి మండలాధ్యక్షులు ములకాల సాయికృష్ణ, బొర్రా నరేష్ కుమార్, మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, నాయకులు అందరూ భాగస్వామ్యం అవ్వాలని, సమిష్టి కృషితో మండలంలో నీటి నిల్వలు పెంచాలని, రెండవ పంట పండించే విధంగా రైతులకు సహకారం అందించాలని, అదేవిధంగా మండలంలో మరియు వడ్డిగూడెం పంచాయతీలోని నీటి సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు ఇలా అనేక సమస్యలపై దృష్టి పెడతామని, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేశారని, చివరి స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ ది అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి పాముల ప్రసాద్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి, ఆశ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.