సాలూరులో ఘనంగా డా.అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

సాలూరు శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల ఆవరణలో పాఠశాల కరస్పాండెంట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన జీవితం, సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీంరావ్ రాంజీ అంబేద్కర్ సమాజసంస్కరణకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని తెలిపారు. ఆయన న్యాయవాది, రాజకీయ నేతగా మాత్రమే కాకుండా కుల నిర్మూలన, అంటరానితనం తొలగింపు కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం 1990లో ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించిందని గుర్తుచేశారు. భారత చరిత్రలో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా “జై భీమ్” నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.