
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బి. సునీల్ కుమార్, బి. రజినీకాంత్, హరీష్ బ్రహ్మసాని, నాగు కేతునాని, శ్రీకాంత్ పొడ్డూరితో పాటు జూబ్లీహిల్స్‌కు చెందిన కృష్ణవేణి జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసేవలో పనిచేయాలని తాళ్లూరి రామ్ సూచించారు. అలాగే జనసేన నాయకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ రావుతో సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.