అమలాపురంలో ఘనంగా తెలుగుదేశం మహానాడు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహణ

అమలాపురం : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు అమలాపురంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించబడింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

టీడీపీ సీనియర్ నేత కర్రి రామస్వామి (దత్తుడు) అధ్యక్షతన జరిగిన సమావేశానికి అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మొదటగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను ఎమ్మెల్యే ఆనందరావు, కర్రి రామస్వామి కలిసి కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు విజయవంతంగా ముగియడం పట్ల నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.