
ముమ్మిడివరం : గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు గురువారం ఉయ్యాల సేవ, దండాడింపు కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ కొనసాగి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారిని జోలపాటలతో అత్తవారి ఇంటికి సాగనంపే సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విళ్ల సూర్యరావు మరియు పోలిశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొని రంగోలి చల్లుకుంటూ, మేళతాళాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా సాగనంపారు.
సంతాన భాగ్యం కోసం మొక్కుకున్న భక్తులు ప్రత్యేకంగా నిర్వహించిన ఉయ్యాల సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమంలో పోలమూరి వంశీయులు, విళ్ల సూరిబాబు – వీరాస్వామి దంపతులు, విళ్ల గణేష్, పోలిశెట్టి బాబులు, పోలిశెట్టి బాబీ, విళ్ల శ్రీను, గణేశుల బ్రహ్మానందం, రంబాల శంకర్, చోడపనీడి బాబీ, వీరా సాయి శ్రీనివాస్, కోమలి ప్రసాద్, కర్ర దుర్గాప్రసాద్, నిమ్మకాయల విస్సు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో జాతర మహోత్సవాలు విజయవంతంగా ముగియడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.