
అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రైతు బజార్లు, ప్రభుత్వ విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నారు. బీపీటీ (BPT), కేఎన్‌ఎం (KNM) స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, పచ్చి బియ్యం (రా రైస్)ను కిలో రూ.50కు విక్రయించాలని నిర్ణయించారు.
బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని రైస్ మిల్లర్లు హామీ ఇచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.