
- మంత్రి సవితకు జనసేన నాయకుల ఘన సన్మానం
పెనుకొండ: గోరంట్లలో కదిరి మెయిన్ రోడ్‌లోని ఎముకల గుట్టపల్లి మీదుగా కొలింపల్లి గ్రామం వరకు 9 గ్రామాలను కలుపుతూ సుమారు 11 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.47 కోట్ల వ్యయంతో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సవితను గోరంట్ల జనసేన నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే ఈ రహదారి నిర్మాణం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి సురేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి సి. వెంకటేష్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పి. వెంకటేష్, గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరేష్, వానువోలు సింగిల్ విండో డైరెక్టర్ నాగేష్, వీర మహిళ కావేరి, మండల నాయకులు శ్రీనివాసులు, గాజుల రమేష్, శివ, తిరుపాల్, సాయి, నాగభూషణతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.