
మార్కాపురం జిల్లా: తర్లుపాడు మండలం, బీసీ కాలనీలో జూలై 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన జనసేన కార్యకర్త మువ్వ వెంకట సుబ్బయ్య చికిత్స పొందుతూ ఆగస్టు 1న మృతి చెందారు.
ఈ నేపథ్యంలో మృతుడి నివాసానికి చేరుకున్న జనసేన మార్కాపురం జిల్లా నాయకుడు ఇమ్మడి కాశీనాథ్, మువ్వ వెంకట సుబ్బయ్య భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శిరిగిరి శ్రీనివాసరావు, తర్లుపాడు మండల అధ్యక్షుడు చేతుల శ్రీనివాసులు, కంభం వెంకట రమణ, బట్టగిరి మురళీధర్ రెడ్డి, సుమంత్, మహేష్, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని మువ్వ వెంకట సుబ్బయ్యకు ఘనంగా నివాళులర్పించారు.