
అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం వాకలగరువు గ్రామంలోని శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ శిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో పాల్గొని భక్తులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
గురు పౌర్ణమి వంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో ఐకమత్యం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక, ఆధ్యాత్మిక విలువలను బలోపేతం చేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.