
నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యం నింపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమమే తనకు ముఖ్యమని బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.