శ్రీ గురజాల అక్కమ్మ తల్లి జాతరలో మంత్రి కందుల.. రాష్ట్ర శ్రేయస్సు కోసం పూజలు

రాజమహేంద్రవరం: సాటిలైట్ సిటీలో వైభవంగా జరుగుతున్న శ్రీ గురజాల అక్కమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రగతి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గ్రామీణ జాతరలు, సంస్కృతి, సంప్రదాయాలు మన వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.