కొట్టే సాయిని మర్యాదపూర్వకంగా కలిసిన దుర్గం మోహన్

శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయిని సోమవారం జనసేన పార్టీ యువ నాయకుడు, దుర్గం ఫౌండేషన్ అధినేత, ఎన్నారై దుర్గం మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, ప్రజా సేవా కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.

దుర్గం మోహన్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వర ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో కొట్టే సాయి కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఆలయ అభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని, భక్తుల విశ్వాసాలను నిలబెట్టే విధంగా సేవలందిస్తున్నారని అభినందించారు.

అలాగే ధార్మిక, సామాజిక కార్యక్రమాల్లోనూ ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, ఆధ్యాత్మిక సేవల సమన్వయంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కొట్టే సాయికి శుభాకాంక్షలు తెలియజేసిన దుర్గం మోహన్, భవిష్యత్తులో కూడా ప్రజా సేవా కార్యక్రమాల్లో తన సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పందేటి మహేష్ రాజు, మాదాసు శివ, చరణ్ తదితరులు పాల్గొని కొట్టే సాయిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.