
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన ‘మీకై.. మేము’ వెల్ఫేర్ అసోసియేషన్
సాలూరు: అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాలూరు పట్టణం కరణాల వీధికి చెందిన గంట జ్ఞానేశ్వరరావుకు ‘మీకై.. మేము’ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించాయి.
సంస్థ అధ్యక్షుడు ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గంట జ్ఞానేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ, ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థలకు తెలియజేయడంతో, సంస్థ ప్రతినిధులు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక స్థితిని పరిశీలించారు.
వారి పరిస్థితికి స్పందించిన ‘మీకై.. మేము’ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా రూ.10,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశాయి.
అలాగే బాధితుడి పరిస్థితిని పలువురు దాతలకు వివరించగా, నవజీవన్ ట్రస్ట్ తరఫున చిక్కాల చిన్నమ్మలు (శాంతి) ఒక సీలింగ్ ఫ్యాన్, 25 కిలోల బియ్యం బస్తా, నిత్యావసర సరుకులను అందించారు. మాదేటి సుధీర్ కూడా ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఇతర దాతలు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా తమ వంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
సహకరించిన ప్రతి దాతకు, సంస్థలకు ‘మీకై.. మేము’ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఇప్పిలి దిలీప్ కుమార్, పసుమర్తి నరేష్ కుమార్, రావాడ జయప్రకాష్, రమా, అరుణ కుమారి, చింతల రామకృష్ణ, రాజేష్, నవజీవన్ ట్రస్ట్ ప్రతినిధి చిక్కాల చిన్నమ్మలు (శాంతి) తదితరులు పాల్గొన్నారు.