కర్నూలులో ఘనంగా ఎన్డీఏ ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ.. భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు

కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు కన్వెన్షన్ హాల్‌లో ఎన్డీఏ కూటమి (కర్నూలు పార్లమెంట్) ఆధ్వర్యంలో ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సభకు ఎన్డీఏ మూడు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి వాల్మీకి బి. లక్ష్మన్న, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, బీజేపీ ఇన్‌చార్జి ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు చింత సురేష్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరు జనసేన ఇన్‌చార్జి రేఖ గౌడ్, కర్నూలు జనసేన ఇన్‌చార్జి హర్షద్, కోడుమూరు ఇన్‌చార్జి ఆకేపోగు రాంబాబు, బీజేపీ సీనియర్ నాయకుడు జగ్గాపురం చిన్న ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సభలో పలువురు వక్తలు ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి జనసేన ముఖ్య నాయకులు కౌతాళం రామాంజనేయులు, పెద్దకడబూరు బజారి (అబ్రహం), ఆలీభాష, కోసిగి వీరారెడ్డి, అగసలదిన్నె నాగరాజు, బదినేహాల్ చిన్నతో పాటు పలువురు కార్యకర్తలు సభలో పాల్గొని విజయవంతం చేశారు.

సభ అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జనసేన మంత్రాలయం ఇన్‌చార్జి వాల్మీకి బి. లక్ష్మన్న, టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జనసేన కర్నూలు ఇన్‌చార్జి హర్షద్, బీజేపీ సీనియర్ నాయకుడు జగ్గాపురం చిన్న ఈరన్న, బీజేపీ ఇన్‌చార్జి ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మిగనూరు బీజేపీ ఇన్‌చార్జి తొగట నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.