
రాజోలు నియోజకవర్గం: కోనసీమ జిల్లా పరిధిలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ 2026 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏఎస్డబ్ల్యుఏ (ఆల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శాసనసభ్యుడు దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 200 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఏఎస్డబ్ల్యుఏ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల విద్యాధికారులు, పాఠశాల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.