‘పెద్ది’ ఎడిట్ లాక్.. జూన్ 3 నుంచి భారీ ప్రీమియర్లు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం పెద్ది నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఎడిటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా ఫైనల్ కట్ లాక్ అయ్యిందని, విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించింది.

‘పెద్ది’ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా “ఎడిట్ వెర్షన్ లాక్ అయింది. 2026 జూన్ 3 నుంచి భారీ ప్రీమియర్లకు సిద్ధంగా ఉంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది” అని ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రామ్ చరణ్‌తో పనిచేయడం స్ఫూర్తిదాయకమని, ఆయన అద్భుతమైన నటుడే కాకుండా మంచి స్నేహితుడని ప్రశంసించారు.

ఈ చిత్రంలోని చివరి పాటను ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని రత్నవేలు, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్షన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.