ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిని నియమించనున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది.

చిరంజీవిని ఏపీ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వార్తలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు సూచించింది.

అధికారికంగా ధృవీకరించని వార్తలను ఇతరులకు షేర్ చేయవద్దని కూడా చిరంజీవి టీమ్ విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి నియామకంపై జరుగుతున్న ప్రచారానికి స్పష్టత వచ్చినట్లయింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.