
కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్లో ఆషాడ బోనాల జాతర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేన నాయకులు పాల్గొన్నారు. పలు దేవాలయ కమిటీల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయాలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, పండుగ సూర్య తదితరులు పాల్గొన్నారు.