
తాటిపర్తి, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తాటిపర్తి గ్రామ పంచాయతీలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తాటిపర్తి గ్రామ 2వ వార్డు సభ్యుడు, జనసేన పార్టీ దేవరకద్ర పీఓసీ సభ్యుడు గోపే లక్ష్మీనారాయణ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గోపే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా కృషి చేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలు, సామాజిక న్యాయం పట్ల ఉన్న అంకితభావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రజల అభ్యున్నతి, సమానత్వం, అభివృద్ధి కోసం జయశంకర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తూ ఆయన ఆశయాలు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హబీబా ఫసియోద్దీన్, గ్రామ కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు మిట్ట నరేందర్, వంగూర్ చిన్న యాదయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ గోపే కేశవులు, ఆకుల వెంకటయ్య, ఫసియోద్దీన్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.