పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ విడుదల చేసిన జనసేన పార్టీ
సమన్వయ సమావేశాల్లో రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల ప్రధాన పాత్ర
జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్య క్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
చిత్తూరు, జనసేన-టిడిపి సమన్వయ సమావేశాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఒక్కో నియోజకవర్గారా్నికి ఒక్కొక్కరిని పార్టీ అధిష్టానం నియమించిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సమన్వయం చేసేందుకు మాత్రమే వీరిని నియమించారన్నారు. ఈ సమావేశాల్లో ఎక్కడా ప్రోటోకాల్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలతో పాటు మండల కమిటీల్లోలోలూని కార్య వర్గాలకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రోటోకాల్‌ను విస్మరించవద్దని సూచించారు. అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పార్టీ సమన్వయ పరిచేందుకు మాత్రమే నియమించారని ఆయన స్పష్టంచేశారు.