చలివేంద్రంలో మజ్జిగ వితరణ కార్యక్రమం

శతఘ్ని సిగ్నేచర్ : కోనసీమ (మే 25) అమలాపురం పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో ఆకినాగరాజు కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. దివంగత ఆకినాగరాజు మనుమడు ఆకి నాగరాజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో సోమవారం దివంగత నామన వెంకటరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల కుమారుడు నామన శ్రీనివాసరావు ప్రజలకు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వ్యాపారవేత్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.