ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుమకుంటలో మొక్కల నాటకం.. సంరక్షణకు ఇనుప కంచెల ఏర్పాటు

తుమకుంట : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుమకుంట గ్రామ సచివాలయ ప్రాంగణం మరియు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ వద్ద మొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలు రకాల మొక్కలను నాటి, వాటి సంరక్షణ కోసం ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్, సర్పంచ్ రత్నమ్మ, ఎంపీటీసీ షమీం తాజ్, చిన్న వీరప్ప, ముద్దు కృష్ణ, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కేం చెరాయప్ప, వెల్ఫేర్ అసిస్టెంట్ వలి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ ముత్యాలప్ప, డిజిటల్ అసిస్టెంట్ శ్వేత, ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవప్ప, సూర్య రోష్ని లిమిటెడ్ సీసీఓ మాణిక్ పాటిల్, సూర్య ఫౌండేషన్ ఇన్‌చార్జి వేణుగోపాల్, టీజీ నాగరాజ్ డీలర్, పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ మహేష్, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సూర్య రోష్ని లిమిటెడ్ సీసీఓ మాణిక్ పాటిల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల పుట్టినరోజులను కేవలం కేక్ కట్ చేయడం ద్వారా కాకుండా ఒక మొక్కను నాటి జరుపుకోవాలని సూచించారు. ప్రతి పుట్టినరోజుకు ఒక చెట్టును నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్దవిగా పెంచడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని పచ్చదనాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కల పెంపకంపై ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.