
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం మరియు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ముందుండే నాయకుడిగా జనసేన నాయకుడు రాయల్ కుమార్ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల రోడ్డు సమస్యకు పరిష్కారం చూపించిన ఆయన, తాజాగా మరో ప్రజా సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చారు.
పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపల్ వాటర్ బోర్ చెడిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను రాయల్ కుమార్ మున్సిపల్ డీఈ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వెంటనే స్పందించి బోర్ సమస్యను పరిష్కరించారు.
దీంతో అక్కడ నివసిస్తున్న వందకు పైగా కుటుంబాలు ఊరట చెందడంతో పాటు రాయల్ కుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాయల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేర్పించారని, అదే ఆదర్శంతో ప్రజలకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. “ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేది జనసేన” అని ఆయన అన్నారు.