తాడేపల్లిలో డ్రైనేజీ సమస్యలకు జనసేన తక్షణ స్పందన

తాడేపల్లి: తాడేపల్లి పట్టణంలోని సాలం హోటల్ సెంటర్ సమీపంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానికులు జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతి రావు దృష్టికి తీసుకెళ్లారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే అంబటి తిరుపతి రావు సంబంధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సానిటరీ సిబ్బందిని పిలిపించి డ్రైనేజీ కాలువలను తక్షణమే శుభ్రపరచాలని, అడ్డంకులు ఉన్న ప్రాంతాలను క్లియర్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర్లు (జనసేన బాబాయ్), దుర్గ బాబు, శివ, వేముల వెంకట్, మల్లెల దుర్గ బాబు, దినేష్ చక్రవర్తి, మేక నాని, వెంకీ, నంద్యాల శ్రీనివాస్ రావు, చంద్రశేఖర్, చెన్నుపాటి శేషు బాబు, అంబటి అన్వేష్ తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.