
రాజోలు: సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడు గ్రామంలో రాజోలు – అంతర్వేది వయా శృంగవరప్పాడు మీదుగా వెళ్ళే నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును శాసన సభ్యులు దేవ వరప్రసాద్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన అందుబాటులో ఉండే ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.ముఖ్యంగా మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.