
ఆమదాలవలస : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమదాలవలస నియోజకవర్గంలోని కత్యాచార్యులపేటకు చెందిన జనసైనికుడు తమ్మినేని వెంకటేష్‌ను జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. తమ్మినేని వెంకటేష్ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నందున, పార్టీ తరఫున లభించే ప్రమాద బీమా ప్రయోజనం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జనసేన నాయకులు పేడాడ నర్సింగరావు, శిర్లపు గణేష్, మజ్జి రాంబాబు, పొట్నూరు ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.