సీఎం సహాయ నిధి…. పేదలకు పెన్నిధి

* 65 మందికి రూ 70.4 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే శ్రీ అంజిబాబు

సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి అని, ఆరోగ్యపరంగా అండగా ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం 65 మంది లబ్ధిదారులకు రూ 70,40,483 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ అంజిబాబు అందించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు భీమవరం నియోజకవర్గంలో 758 మంది లబ్ధిదారులకు రూ 6 కోట్ల 10 లక్షల 2 వేల 999 లను అందించామని, అర్హత ఆధారంగా అవసరార్ధులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామన్నారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా వైద్యం, ఇతర అత్యవసరాల కోసం బాధితులకు చెక్కుల పంపిణీ నిరంతరం కొనసాగుతోందని, అర్హులైన పేదలకు సకాలంలో సాయం అందుతోందన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.