నిర్మాణ సారథుల కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు: జనసేన జానీ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకుడు, అరకు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడు జనసేన జానీ తనకు కమిటీలో అవకాశం కల్పించినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి నాగబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన నిర్మాణ సారథుల కార్యక్రమంలో తనను కమిటీ సభ్యుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను కేవలం ఒక పదవిగా కాకుండా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవ చేసే అవకాశంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రయాణంలో కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తూ నాయకత్వం, క్రమశిక్షణ, సమన్వయం, ప్రజా సమస్యలపై అవగాహన వంటి ఎన్నో విలువైన అనుభవాలను సొంతం చేసుకున్నానని చెప్పారు. ముఖ్యంగా నాగబాబు నాయకత్వంలో పని చేసే అవకాశం లభించడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆయనలోని సహనం, బాధ్యత, నిబద్ధతను దగ్గరగా గమనించే అవకాశం దక్కిందని పేర్కొన్నారు.

తన పుట్టినరోజును నాగబాబు సమక్షంలో నిర్వహించినందుకు, అలాగే ఆయన వ్యక్తిగత సిబ్బంది, అరకు పార్లమెంట్ కమిటీ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిజాయితీతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటానని జనసేన జానీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.