ఏలూరు పార్లమెంట్ నుంచి కేంద్ర కార్యాలయానికి 2,423 దరఖాస్తుల తరలింపు

ఏలూరు : జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో రికార్డు స్థాయిలో 2,423 దరఖాస్తులు స్వీకరించినట్లు పార్లమెంట్ పరిశీలకుడు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి అందిన దరఖాస్తులన్నింటినీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఐటీ విభాగం ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. అనంతరం వాటిని ప్రత్యేక పెట్టెల్లో భద్రపరచి సీల్ వేసి, ఎమ్మెల్యే పర్యవేక్షణలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.

ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, దరఖాస్తుల స్వీకరణ, డిజిటలైజేషన్, ప్యాకింగ్ ప్రక్రియను సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేసిన నిర్మాణ సారథుల కమిటీ సభ్యులు, ఐటీ విభాగం సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, చింతలపూడి జనసేన ఇన్‌చార్జి మేక ఈశ్వరయ్యతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.