నిరుపేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన రామ సుబ్బారావు

చినగంజాం : నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గౌరవ సలహాదారు, చినగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కుర్రి రామ సుబ్బారావు మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి అఖిల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంజినీరింగ్ తొలి సంవత్సరం చదువుతోంది. ఆమె ప్రతిభను గుర్తించిన కుర్రి రామ సుబ్బారావు, చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షుడు వలివేటి విశ్వనాథ్ బాబు తదితరులు కలిసి అఖిల ఉన్నత విద్యకు తోడ్పాటుగా ల్యాప్‌టాప్ అందించాలని నిర్ణయించారు.

వారి పిలుపుకు స్పందించిన చినగంజాం, సోపిరాల గ్రామాల దాతలు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించడంతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి సోపిరాల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కుర్రి రామ సుబ్బారావు చేతుల మీదుగా విద్యార్థిని అఖిలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వలివేటి విశ్వనాథ్ బాబు, కుర్రి రామ సుబ్బారావు కుటుంబ సభ్యులు, చినగంజాం, సోపిరాల గ్రామాల పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థిని ఉమ్మారెడ్డి అఖిల మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి రామ సుబ్బారావు, ఆయన మిత్రులు అందించిన ల్యాప్‌టాప్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, చదువులో మరింత కృషి చేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఈ సహాయానికి దాతలందరికీ, చినగంజాం, సోపిరాల గ్రామ ప్రజలకు ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.