
అనాథ చిన్నారుల భవిష్యత్తుకు అండగా పవన్ కళ్యాణ్
పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రభుత్వ జీతాన్ని సామాజిక సేవకు వినియోగించారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా తనకు వచ్చిన రూ.2.10 లక్షల ప్రభుత్వ జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులను కోల్పోయిన 48 మంది అనాథ చిన్నారుల భవిష్యత్తు కోసం చెక్కుల రూపంలో అందజేశారు.
అంతేకాకుండా అత్యవసర ఆర్థిక సహాయం అవసరమైన మరో ఇద్దరు చిన్నారులకు తన వ్యక్తిగత నిధుల నుంచి అదనపు సహాయాన్ని అందించి వారి విద్య, సంక్షేమానికి అండగా నిలిచారు.
ప్రజా ప్రతినిధిగా అధికార బాధ్యతలను నిర్వర్తిస్తూనే సామాజిక బాధ్యతను కూడా సమానంగా నిర్వర్తిస్తూ, అవసరంలో ఉన్న చిన్నారుల జీవితాల్లో భరోసా నింపే కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ నిరంతరం కొనసాగిస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.