
అమలాపురం: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా అమలాపురంలో నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, దరఖాస్తుదారులు తరలిరావడంతో కార్యక్రమం రాత్రి 8.30 గంటలు దాటినా కొనసాగింది.
ఒక్కరోజే సుమారు 500 దరఖాస్తులు స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారంతో ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో చివరి దశలో దరఖాస్తుదారుల రద్దీ మరింత పెరిగింది.
అమలాపురం పార్లమెంట్ అబ్జర్వర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రతి దరఖాస్తుదారును స్వయంగా కలుసుకుని వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించారు. ఉదయం నుంచి దాదాపు 12 గంటలపాటు ఎలాంటి విరామం లేకుండా నిరంతరం దరఖాస్తుల పరిశీలన, స్వీకరణలో పాల్గొన్న పంచకర్ల రమేష్ బాబు సేవాభావాన్ని సమాచార సేకరణ కమిటీ సభ్యులు, జనసేన కార్యకర్తలు, దరఖాస్తుదారులు అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.