
రాజోలు: లక్కవరం ఎంజి గార్డెన్స్ మినీ ఫంక్షన్ హాల్‌లో మలికిపురం మండలానికి చెందిన విశ్వేశ్వరాయపురం మరియు ఇరుసుమండ గ్రామాల రైతులకు రీ-సర్వే పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూ రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ధారించబడతాయని తెలిపారు. దీని ద్వారా రైతులకు భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులకు స్పష్టమైన భూహక్కులు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.