హైదరాబాద్‌లో జనసేన నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడుతోంది. పార్టీ విస్తరణకు మరింత ఊతమిచ్చేలా హైదరాబాద్‌లో జూన్ 19న జనసేన పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానుంది.

పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు అందుబాటులో ఉండే కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఈ నూతన రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది.

తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడడం, యువతకు రాజకీయ దిశానిర్దేశం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో జనసేన ముందుకు సాగుతోంది. రాబోయే జి.హెచ్.ఎం.సి ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాలకు ఈ కార్యాలయం కీలక కేంద్రంగా నిలవనుంది.

తెలంగాణ రాజకీయాల్లో జనసేనను మరింత బలమైన శక్తిగా నిలబెట్టే దిశగా నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.