ఆగస్టు 12న కనిగిరిలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆగస్టు 12న కనిగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. కనిగిరి పట్టణంలోని జి.సి.వై.పి.ఎన్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

మార్కాపురం కలెక్టరేట్‌లో బుధవారం మెగా జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుద్యోగ యువతీ యువకులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.

అర్హత కలిగిన యువత పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి నదన్ బాబు, నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.