స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు (అనకాపల్లి), శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు (పెందుర్తి), శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు (తిరుపతి), శ్రీ పంతం నానాజీ గారు (కాకినాడ రూరల్), శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు (తాడేపల్లిగూడెం), శ్రీ సీహెచ్ వంశీకృష్ణ గారు (విశాఖ సౌత్), మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు సభ్యులుగా ఉంటారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులకు త్వరలో దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.