రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారమే చివరి అవకాశం

రాజంపేట: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ గత మూడు రోజులుగా కొనసాగుతోంది.

గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీ, నగర/పట్టణ, మండల, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిల్లో వివిధ బాధ్యతలను చేపట్టాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను కమిటీ స్వీకరిస్తోంది. దరఖాస్తులు సమర్పించిన ప్రతి అభ్యర్థికి అక్నాలెడ్జ్‌మెంట్ కార్డులు కూడా అందజేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ విజ్ఞప్తి చేసింది.

పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని గుర్తించడం, భవిష్యత్ బాధ్యతల కేటాయింపుకు అవసరమైన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ఈ ప్రక్రియను చేపట్టినట్లు కమిటీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.