బాలినేని సుబ్బారెడ్డికి ఘన నివాళులు

బాలినేని సుబ్బారెడ్డికి ఘన నివాళులు

కొండెపి: టంగుటూరు మండలం కొణిజేడు గ్రామానికి చెందిన బాలినేని సుబ్బారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి జనసేన పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా హాజరై పూలమాలలు వేసి సుబ్బారెడ్డి కి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు.

అలాగే, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తో కలిసి పార్థివదేహానికి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సుబ్బారెడ్డి కి తుదివీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.