
మార్కాపురం సమీపంలోని జమ్మనపల్లి మార్గంలో ఉన్న శ్రీ ముద్దసాని అమ్మవారి దేవాలయంలో ఆదివారం ఆషాఢ మాసం తొలి వారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
భక్తులు కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, చీరలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ గండి కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, క్యూలైన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయగా, ప్రశాంత వాతావరణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.