
ఇచ్చాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి సమక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గతంలో జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో రానున్న స్థానిక ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి ప్రతి జనసైనికుడు, నాయకుడు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేలా సమాయత్తం కావాలని సూచించారు.
గత ఎన్నికల అనుభవం, పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి కూడా మండల స్థాయిలో పోటీ చేసే అవకాశాలపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని తిప్పన దుర్యోధన రెడ్డి తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు మండలస్థాయి నాయకత్వం సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఏఎంసీ సభ్యులు, సంజీ, రాహుల్, శంకర్ రెడ్డి, రంగయ్య, ఆదినారాయణ, రఘునాథ్, సాహు, తిర్నాక్, చిట్టి, పొన్నగంటి గణేష్, చిత్రబహర జయరాం, దేనబంధు, జనార్ధన, సురేష్, పురుషోత్తం, బడే జోగారావు, తిరునాద్ తదితరులు పాల్గొన్నారు.