జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణలో దరఖాస్తు సమర్పించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజమండ్రి : రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి, జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గురువారం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని హుకుంపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా తన దరఖాస్తును రాజమండ్రి పార్లమెంట్ పరిశీలకుడు కొటికలపూడి గోవింద్ రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాన్య కార్యకర్తలను సైతం నీతి, నిజాయితీలతో ప్రజాసేవ చేసే నాయకులుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఇలాంటి ఆలోచన రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా అరుదుగా కనిపిస్తుందని పేర్కొన్నారు.

గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తి, అర్హత ఉన్న నాయకులు, కార్యకర్తలు తమకు నచ్చిన పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. ఆ పిలుపులో భాగంగానే తాను కూడా తన దరఖాస్తును సమర్పించినట్లు చెప్పారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకత్వ అవకాశాలు కల్పించడం జనసేన ప్రత్యేకత అని పేర్కొన్న ఆమె, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఇలాంటి ప్రజాస్వామ్యయుత అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్హతలకు అనుగుణమైన పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.