పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం.. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జనసేన నాయకులు


రాజోలు నియోజకవర్గంలోని వేగివారిపాలెం గ్రామానికి చెందిన ఆచంట సాయి కృష్ణ కుటుంబ సభ్యులు పులపర్తి సామాలిక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచంట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజోలు మనోజ్ మానసిక అనాథ ఆశ్రమంలో అన్నదానం చేపట్టి ఆశ్రమ వాసులకు భోజనాన్ని అందజేశారు.

ఈ సేవా కార్యక్రమంలో జనసేన నాయకులు, “జనం కోసం మనం” జనసేన కువైట్ గ్రూప్ సభ్యులు ఎర్రంశెట్టి బాబి, పంచదార చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమంలోని వారికి ఆప్యాయంగా భోజనం వడ్డించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవా భావన, మానవతా విలువలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలను ఆర్భాటాలకు దూరంగా ఉంచి సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ద్వారా అవసరమైన వారికి తోడ్పాటును అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

అనాథ ఆశ్రమ నిర్వాహకులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.