
సఖినేటిపల్లి లంక ప్రజలకు అండగా జనసేన – ఉచిత త్రాగునీటి పంపిణీ
సఖినేటిపల్లి లంకలోని వినాయకుని గుడి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు స్పందిస్తూ జనసేన పార్టీ చిరుపవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీటి సరఫరా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించిన జనసేన నాయకులు వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచితంగా త్రాగునీటిని అందించారు. ఈ కార్యక్రమానికి వీరభద్ర చికెన్ సెంటర్ నిర్వాహకుడు ఆకుల సతీష్ ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, డ్రైవర్ వేతనానికి ఆర్థిక సహాయం అందించి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు, సఖినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షులు నామన నాగభూషణం మాట్లాడుతూ, ప్రజల అవసరాలే తమకు ప్రాధాన్యమని అన్నారు. త్రాగునీటి సమస్యలు ఎదురైన ప్రతి ప్రాంతానికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం జనసేన పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, తక్షణ స్పందనకు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.