
చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన సేవలు చిరస్మరణీయం: నాయకులు
జనసేన పార్టీ నాయకుడు, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లి హౌస్ పెట్ చైర్మన్ ముస్తూరు రామ్మోహన్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తోట కళ్యాణ్, అడపా సురేంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముస్తూరు రామ్మోహన్ చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు.
చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్మికుల పట్ల ఆయన చూపిస్తున్న అంకితభావం అందరికీ ఆదర్శమని అన్నారు.
ఈ సందర్భంగా ముస్తూరు రామ్మోహన్‌కు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అజయ్, నరేంద్ర, దీపక్ సింగ్, ఉమేష్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.