వైభవంగా ముగిసిన శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ జాతర, తీర్థ మహోత్సవాలు

ముమ్మిడివరం : గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు గురువారం ఉయ్యాల సేవ, దండాడింపు కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ కొనసాగి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారిని జోలపాటలతో అత్తవారి ఇంటికి సాగనంపే సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విళ్ల సూర్యరావు మరియు పోలిశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొని రంగోలి చల్లుకుంటూ, మేళతాళాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా సాగనంపారు.

సంతాన భాగ్యం కోసం మొక్కుకున్న భక్తులు ప్రత్యేకంగా నిర్వహించిన ఉయ్యాల సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ఈ కార్యక్రమంలో పోలమూరి వంశీయులువిళ్ల సూరిబాబు – వీరాస్వామి దంపతులువిళ్ల గణేష్పోలిశెట్టి బాబులుపోలిశెట్టి బాబీవిళ్ల శ్రీనుగణేశుల బ్రహ్మానందంరంబాల శంకర్చోడపనీడి బాబీవీరా సాయి శ్రీనివాస్కోమలి ప్రసాద్కర్ర దుర్గాప్రసాద్నిమ్మకాయల విస్సు తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో జాతర మహోత్సవాలు విజయవంతంగా ముగియడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.