పొన్నలూరులో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

కొండపి: పొన్నలూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

మంత్రి వీరాంజనేయస్వామితో కలిసి జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను మరింత ఘనంగా చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.