
పుట్టపర్తి: జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ కొత్తచెరువు మండలంలో కాలువగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో జనసైనికులు కలిసి నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక అర్చనలు చేసి ఆంజనేయ స్వామిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా పూల శివప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని దేవుని ప్రార్థించామని తెలిపారు. ప్రజాసేవలో ఆయన పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నారాయణ స్వామి, మేడాపురం సల్లప్ప, హనుమంతు నాయక్, బాలినేని గంగాద్రి, సాయి ప్రకాశ్, గురుమూర్తి, విజయ సింహా, దాసరి రామకృష్ణ, పసల జాలప్ప తదితరులు పాల్గొన్నారు.